వరడు..పురుడు…విరుగుడు

Posted: May 13, 2010 in పురుడు, వరుడు

మరో మద్యానం……..

మళ్లీ కుణుకుపాటలే…….కాని ఈ సారి పాడేది నేను కాదండోయ్..నా ఫ్రెండ్ ఇక్బాల్. ఇక్కడ ఇంకో విషయం ఉంది మా వాడి పెళ్లి అయ్యి పట్టుమని పది రోజులు కూడా అవ్వలేదు..ఇప్పడు పట్టేసుంటారు ఇతగాడే మన వరడు. పెల్లికోసమని పది రోజులు సెలవు పెట్టి ఇవ్వలే ఆఫీసుకి తిరిగి వచ్చాడు. పెళ్లి నల్గొండలో జరిగింది మా టీం మొత్తం వెళ్లారు..నేను నా పనులలో ( ఏమి పనులో తర్వాత మాట్లాడుకుందాం !! ) వెళ్ళలేకపోయాను.

ఇవ్వాళా ఉదయం నేను ఆఫీసుకి వచ్చేసరికి షకీల్ చుట్టూ అందరు గుమ్ముగూడి సందడి చేస్తున్నారు. షకీల్ అంటే ఎవ్వర్రోఅనుకున్నేరు మన వరుడు పూర్తి పేరు మొహ్హమ్మాద్ షకీల్ ఇక్బాల్ ఆ మూడు పేర్లలో ఎవరకూ నచ్చింది వాళ్ళు పిలుస్తారు. అలాగా అందరి మధ్యలో ఉన్న ఇక్బాల్ ని చూస్తే ఈ మద్యనే రిలీజ్ అయ్యిన మణిరత్నం గారి హిందీ రావణ్లో कटारे.. कटारे.. बेचारा बकरा అనే పాట ఒకటి గుర్తోంచింది . నాలో నేనే నవ్వుకొని నేనూ వెళ్లి మిగతావాళ్ళతో కలసి షకీల్ ని ఆటపట్టించాను.

అస్సలు విషయంకి వద్దాం, మధ్యానం కుణుకు తీస్తున్న షకీల్ ని చూసి ఒకటి గమన్నిచ్చాను..అదేంటో చెప్పే ముందు మీకు ఇక్బాల్ గురించి కొంచం చెప్పాలి. మా షకీల్ ఇంచు మించు ఆరు అడుగుల ఎత్తు, కసరత్తుకి అలవాటు పడిన దేహధారుడ్యం కలిగి ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఈ ఆరు పలకల సమాజంలో, సిక్స్ ప్యాక్ లేకపోయినా ఫ్యామిలీ ప్యాక్ ఉండకూడదు అనుకునే మనిషి.

ఐతే అటువంటి మా షకీల్ కు, ఈ మద్యనే పెల్లికావడం వల్లనో (యూత్ నుండి ఫ్యామిలీగా మారిన గుర్తుగానో) , లేక మామగారింట్లో క్రొత్త అల్లుడి బాద్యతలు (విందులు-వినోదాలు) నిర్వత్హించడం వల్లనో మావాడు కొంచం బొజ్జ సంపాదించాడు. నిద్రోలో ఉన్న మా వాడి ఉచ్వాస -నిచ్వసా లకు అనుగుణంగా ఆ బొజ్జ సంకోచ -వ్యాకోచాలు చెందుతుంది.

అది చూసి ఈ మద్యనే వచ్చిన మన అల్లు అర్జున్ సినిమా వరుడుకి ప్యారడి పురుడు గా ప్రాచుర్యంలోకి వచ్చిన ఒక ఎమెయిల్ ఒకటి గుర్తుకుతెచుకొని నవ్వుకున్నాను.

ఇంతా రాస్తుంటే ఎవరూ మహానుభావుడు చెప్పిన్న(నాకు చెప్పింది మాత్రం వాసు అని నా మిత్రుడు ) గురువింద గింజ తన నలుపు ఎరగదు అన్న సామెత గుర్తుకువచ్చింది. అందుకే ఇంక ఇప్పటికి వ్రాయటం ఆపి నా పురుడు కి విరుగుడు పెట్టె పనిలో ఉంటా …….

ఇక ఉంటా మరి……

Advertisements
Comments
  1. SRINIVAS says:

    SUKHA NIDRA PRAPTIRASTHU!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s